Monday, November 1, 2010

ఐతే అది నిజమైతే !!!

కష్టాల్లో వున్న ఒక అమ్మాయికి అండగా నిలుస్తూ తన ఉన్నతి కోసం అనుక్షణం పాటుపడే ఒక స్నేహితుడు ఆమెకోసం ఒక వరుడిని చూశాడు. అతను అనుకున్నట్టుగా వాళ్ళిద్దరూ జంటగా కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అని పాట రూపంలో మనకి చెప్తున్నాడు.

నాకు ఈ పాటలో బాగా నచ్చినదేంటంటే, సాధారణంగా ఎవరికైనా మనం ఏదైనా ఉపకారం చేస్తే తిరిగి ఏదో ఒకటి ఆశిస్తాం. కానీ ఇక్కడ ఆ స్నేహితుడు ఏమీ ఆశించకుండా తన స్నేహితురాలు జీవితం ఉన్నతంగా వుండాలని కోరుకోవడం. ఆ ఉన్నతిని నిజాయితీగా ఆనందించడం. ఇలాంటి వాళ్ళు సినిమాల్లో తప్ప బయట కనిపించరనుకోండి అది వేరే విషయం.

ఈ పాటలోని పోలికలు నాకు చాలా ఇష్టం.

"ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే .. అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే.. "
పున్నమి వెన్నెల్లో విచ్చుకున్న పువ్వులు గాలికి ఊగుతూ నవ్వుతున్నట్టు అనిపించే క్షణం అనుభవించిన వాళ్ళకి అనిపిస్తుంది, ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి అని. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఇల్లు ఎల్లప్పుడూ అలానే వుంటుంది అనే భావన.

"ఆ నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా"
ఒక సంస్థ అధిపతిగా ఉన్నత స్థానంలో వున్న అతనికి, అతని దగ్గర పనిచేసే ఆమెకి మధ్య అంతస్థుల్లో ఎంత తేడా ఉన్నా వాళ్ళని కలపడానికి రాయబారిని నేను అవుతా.

"చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా
ఆ చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా"
అతను ఒప్పుకుంటే వెన్నెల కురిసినపుడు కలువ పూవు పొందే ఆనందం ఆమె పొందుతుందని, అదే ఆమె ఒప్పుకుంటే అతని ముఃఖం పున్నమి చంద్రునిలా ప్రకాశిస్తుంది.

"నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే"
అతని ఆశలు అలా అలా ఆకాశానికి వెళ్ళి తరలతో కలిసి వాళ్ళ పెళ్ళికి తలంబ్రాలుగా కురిసే వేళ వాళ్ళిద్దరూ చేరువైతే.

"రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం"
స్త్రీ సహజమైన సిగ్గుతో చాటుగా ఆమె, అలాంటివేమి లెకుండా అతను చూసుకుంటూ చూపులతోనే రాయని శుభలేఖలు రాసుకుంటున్న ఈ సమయం కన్నా ఇంక సుముహూర్తం లేదని ఆకాశంలో వున్న అరుధతీ దేవి నిర్ణయించేసిందంట.

"మనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే"
సంధ్యాసమయం కనిపించే అరుణవర్ణం ఆమె నుదుట అతను దిద్దిన కుంకుమై మెరిసే వేళా వాళ్ళిద్దరూ చేరువైతే !!!

చిత్రం: శుభలేఖ
రచన: వేటూరి


ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల ల లా ల
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే .. ఐతే

నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే.. ఐతే

రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం
మనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే .. ఐతే
PS : ఇదే మొదటిసారి నేను ఒకపాట గురించి రాయడం. తప్పులు వున్నా, చెప్పిన విషయం క్లియర్ గా లేకపోయినా క్షమించేసి తప్పులు చెప్తే కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.

Wednesday, October 20, 2010

స్వీట్ హోం

ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. అబ్బాయి ఇంట్లో ఆ విషయం చెప్పేశాడు. ఈ రోజు ఆమెని తన అమ్మా నాన్నకి పరిచయం చెయ్యడానికి ఇంటికి తీసుకెళ్తున్నాడు.
అటువంటి సమయంలో ఆ అబ్బాయి తల్లి మనసులో ఆలోచనలు ఎలా వుంటాయి?
ఆ అమ్మాయి అంతరంగంలో అలజడి ఏమిటి ?
అసలు ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎటువంటిది ?
వాళ్ళ మధ్య సంభంధాలు ఎలా వున్నాయి ?

వీటన్నింటిని కాస్త హస్యంగాను కాస్త సెంటిమెంట్ తోను మరి కాస్త సస్పెన్స్ లోను పెట్టి మనకు చూపించారు బాలజీ & టీం ఈ "మిఠాయి వీడు" (స్వీట్ హోం) అనే లఘుచిత్రంలో. ఈ లఘుచిత్రం తమిళ్ లో వున్నా కానీ చూసేవాళ్ళకి భాషతో పని లేకుండా నటీనటుల హావభావాలతో కేమెరా పనితనంతో అందరికి అర్ధమయ్యేలా తీశారు. నా వరకు నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. కింద వీడియో వుంది చూడండి.Wednesday, September 29, 2010

యంథిరన్ రివ్యూ ???

ఈ రోజు ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న యంథిరన్ సినిమా ప్రీమియర్ షో చూశాను. సినిమా మొత్తంగా చూస్తే బానే వుంది. ఎప్పటిలాగే రజినీకాంత్ బాగా చేశాడు. ఐశ్వర్యరాయ్ అందంగా కనిపించింది అక్కడక్కడా వయసు మీద పడిన చాయలు కనిపించాయి. శంకర్ దర్శకత్వం గురించి చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా తీశాడు కాకపోతే అక్కడక్కడా చిన్న చిన్న స్క్రీన్ ప్లే లోపాలు వున్నాయి. కొన్ని చోట్ల సీన్ కీ సీన్ కీ మధ్య సింక్ మిస్ అయ్యింది. కారణం నిర్మాణం లో జరిగిన జాప్యం అనుకుంటా. కానీ గ్రాఫిక్ వర్క్ మాత్రం ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు ఎన్నడూ చూడనంత అద్భుతంగా వున్నయి. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించాయి.

పోజిటివ్స్ :
రజినీకాంత్ పంచ్ డైలాగ్స్, రోబోగా చేసిన విన్యాసాలు
ఐశ్వర్యారాయ్(బచ్చన్) నటన
గ్రాఫిక్స్

నెగెటివ్స్ :
రజనీ హ్యూమన్ కేరెక్టర్ కి డెప్త్ లేకపోవడం
అక్కడక్కడా స్క్రీన్ ప్లే లోపాలు
పాటల పిక్చరైజేషన్
స్టొరీ లో కొంచెం పట్టు తగ్గినట్టనిపించింది. శంకర్ ఆస్థాన రచయిత సుజాత లేని లోటు కనిపించింది.

ఓవరాల్ రేటింగ్ : 3.25 etc ...............................//

అని రేపు సాయంత్రం ప్రీమియర్ చూసొచ్చి రివ్యూ రాద్దామనుకున్నా. కానీ ఇక్కడ మా ఆఫీస్ టైంలో వేస్తున్నారు అందుకని వెళ్ళడం కుదరడం లేదు :(

Monday, August 23, 2010

గ్రేట్ ఆంధ్రా??

ఇది చూశారా, తమ్ముళ్ళు డ్రగ్ స్కాంలో ఇరుక్కుంటే వారిని బయటకి తీసుకురాకపోవడం వల్ల రవితేజ భాద్యత లేని అన్నయ్య అయ్యాడంట.
అంతే కాకుండా నిజాల్ని కప్పిపెట్టే అవకాశం వుండి కూడా అలా చెయ్యకుండా మొత్తం సినీప్రశ్రమకే తలవంపులు తెచ్చాడంటా.

అనుకునేవాడు వంద అనుకుంటాడు, వాటిని కూడా వార్తలుగా రాయడం గ్రేట్ ఆంధ్రావారికే చెల్లింది. ఎప్పటికి మారతారో వీళ్ళు ?!!

న్యూస్ చానల్స్ కూడా సినిమావాళ్ళు వున్నారని హడవుడి చేస్తున్నారు కాని హైదరాబాద్ లోనే కాదు మొత్తం అంధ్రాలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే గంజాయి గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నారా ?

Monday, June 28, 2010

ఐ-ఫోన్ లో తెలుగు
ఐ-ఫోన్ యూజర్స్ కు శుభవార్త. ఐ-ఫోన్ లోని సఫారి బ్రౌజర్ ఇప్పుడు తెలుగు యునికోడ్ సప్పోర్ట్ చేస్తుంది. దీనికొఱకు మీరు ఆపిల్ వారి కొత్త ఆపరేటింగ్ సిస్టం iOS4ను ఇన్స్టాల్ చేసుకోవలసి వుంటుంది. నేను మాలిక, కూడలిలు ప్రయత్నించాను. చదవడానికి బాగానే వుంది అనిపించింది. టపా పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే నేను సిస్టం లోనే తెలుగు టైపింగ్ కి ఇంకా అలవాటు పడలేదు మరి మొబైల్ లో ఇంకా కష్టమని !

మన తెలుగు సంకలినులు మొబైల్ వర్షన్స్ డెవెలప్ చెయ్యాల్సిన సమయం ఆసన్నమైందేమో :-)

Saturday, June 26, 2010

జఫ్ఫా బాబా !!!ఈ మధ్య ఆంధ్రాలో ఈయన బాగా పాపులర్ అయ్యారు. ఎటువంటి మానసిక రుగ్మతనైనా ముఖకవలికలతోను బాడీ లాంగ్వేజ్ తోనూ పోగొట్టగలిగే మహిమలు కలవాడు అని ప్రచారం జరుగుతోంది.

ఇతని పాపులారిటి చూసి టివి 9 ఇతని గత జీవితం గురించి సమాచారం సేకరించింది. దాన్లో బయట పడిన కొన్ని వివరాలు ఇలా వున్నాయి :
బాచ్ నంబరు 58,
రోల్ నంబరు 132,
గోల్డ్ మెడలిస్ట్,
టాపర్ ఆఫ్ ద బాచ్
ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు.
పాపం వాళ్ళ ఎస్ పి కూతురుకి బాడిగార్డ్ గా వెళ్ళి ఆమె ప్రియుడు సంజయ్ సాహు చేతిలో పడి ఇలా తయారయ్యడని అభిఙవర్గాల సమాచారం.

ఇదే కాకుండా ఇతని గురించి ఇంకో కధ కూడా ప్రచారం లొ వుంది,
ఇతను గతంలో బ్రహ్మి, సాఫ్టువేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. తమ కింది పోర్షన్ లో వుండే శ్రుతి అనే అమ్మాయి వెనకాల పడేవాడు. ఒకానొక సందర్భంలో ఖర్మ కాలి ముష్టియాతో గొడవ పెట్టుకుని వాళ్ళకి ముష్టివెయ్యడానికి బాంకులలో లోన్ తీసుకుని, అవి కట్టలేక ఇలా దొంగ సాధువు అవతారం ఎత్తాడనీ చెప్తూవుంటారు.

ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇతని ఫొటోలను మొబైల్, కంప్యూటర్ వాల్ పేపర్స్ గా పెట్టుకునీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా
ఇతని ఫొటో చూసి తక్షణం ఉపశమనం పొందుతున్నారు, దీనివల్ల సైకియాట్రిస్ట్ ల ప్రాక్టిస్ పడిపోతుందని, వాళ్ళు ఆందోళన నిర్వహించడానికి సమాయత్తమవుతున్నరని సమాచారం.

మరి ఇతని గురించిన నిజానిజాలు పూరి జగన్నాధ్, త్రివిక్రం శ్రీనివాస్ లకే ఎరుక.

photo courtesy : Allu Sirish tweet, http://twitpic.com/1vvyo3

వేవేల మైనాల గానం బ్లాగుకి స్వాగతం.

వేవేల మైనాల గానం బ్లాగుకి స్వాగతం.