Monday, June 28, 2010

ఐ-ఫోన్ లో తెలుగు




ఐ-ఫోన్ యూజర్స్ కు శుభవార్త. ఐ-ఫోన్ లోని సఫారి బ్రౌజర్ ఇప్పుడు తెలుగు యునికోడ్ సప్పోర్ట్ చేస్తుంది. దీనికొఱకు మీరు ఆపిల్ వారి కొత్త ఆపరేటింగ్ సిస్టం iOS4ను ఇన్స్టాల్ చేసుకోవలసి వుంటుంది. నేను మాలిక, కూడలిలు ప్రయత్నించాను. చదవడానికి బాగానే వుంది అనిపించింది. టపా పోస్ట్ చెయ్యడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే నేను సిస్టం లోనే తెలుగు టైపింగ్ కి ఇంకా అలవాటు పడలేదు మరి మొబైల్ లో ఇంకా కష్టమని !

మన తెలుగు సంకలినులు మొబైల్ వర్షన్స్ డెవెలప్ చెయ్యాల్సిన సమయం ఆసన్నమైందేమో :-)

Saturday, June 26, 2010

జఫ్ఫా బాబా !!!



ఈ మధ్య ఆంధ్రాలో ఈయన బాగా పాపులర్ అయ్యారు. ఎటువంటి మానసిక రుగ్మతనైనా ముఖకవలికలతోను బాడీ లాంగ్వేజ్ తోనూ పోగొట్టగలిగే మహిమలు కలవాడు అని ప్రచారం జరుగుతోంది.

ఇతని పాపులారిటి చూసి టివి 9 ఇతని గత జీవితం గురించి సమాచారం సేకరించింది. దాన్లో బయట పడిన కొన్ని వివరాలు ఇలా వున్నాయి :
బాచ్ నంబరు 58,
రోల్ నంబరు 132,
గోల్డ్ మెడలిస్ట్,
టాపర్ ఆఫ్ ద బాచ్
ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు.
పాపం వాళ్ళ ఎస్ పి కూతురుకి బాడిగార్డ్ గా వెళ్ళి ఆమె ప్రియుడు సంజయ్ సాహు చేతిలో పడి ఇలా తయారయ్యడని అభిఙవర్గాల సమాచారం.

ఇదే కాకుండా ఇతని గురించి ఇంకో కధ కూడా ప్రచారం లొ వుంది,
ఇతను గతంలో బ్రహ్మి, సాఫ్టువేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. తమ కింది పోర్షన్ లో వుండే శ్రుతి అనే అమ్మాయి వెనకాల పడేవాడు. ఒకానొక సందర్భంలో ఖర్మ కాలి ముష్టియాతో గొడవ పెట్టుకుని వాళ్ళకి ముష్టివెయ్యడానికి బాంకులలో లోన్ తీసుకుని, అవి కట్టలేక ఇలా దొంగ సాధువు అవతారం ఎత్తాడనీ చెప్తూవుంటారు.

ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇతని ఫొటోలను మొబైల్, కంప్యూటర్ వాల్ పేపర్స్ గా పెట్టుకునీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా
ఇతని ఫొటో చూసి తక్షణం ఉపశమనం పొందుతున్నారు, దీనివల్ల సైకియాట్రిస్ట్ ల ప్రాక్టిస్ పడిపోతుందని, వాళ్ళు ఆందోళన నిర్వహించడానికి సమాయత్తమవుతున్నరని సమాచారం.

మరి ఇతని గురించిన నిజానిజాలు పూరి జగన్నాధ్, త్రివిక్రం శ్రీనివాస్ లకే ఎరుక.

photo courtesy : Allu Sirish tweet, http://twitpic.com/1vvyo3

వేవేల మైనాల గానం బ్లాగుకి స్వాగతం.

వేవేల మైనాల గానం బ్లాగుకి స్వాగతం.