Sunday, May 22, 2011

సమయసన - ఈక్వేడార్ సాంప్రదాయ సంగీతం

జ్యూరిక్ లో ప్రతి సంవత్సరం జూన్లో లాటిన్ అమెరికన్స్ అంతా కలసి "కలియాంతే" అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. మొదట పదివేల మంది లాటిన్ అమెరికన్స్ తో ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌లో ఇప్పుడు ప్రతియేటా లాటిన్ అమెరికన్లతోపాటు మొత్తం యూరప్ నుండి 3లక్షల మంది వరకు హాజరు అవుతున్నారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బ్రెజిల్ తదితర దేశాల నుండి కళాకారులు వచ్చి సంగీత నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. వీటితో పాటు లాటిన్ అమెరికన్‌ల అహారము మరియు పానీయాలు అదనపు ఆకర్షణ. ప్రపంచంలో అన్ని చోట్లా వున్నట్టే ఇక్కడ కూడా ఎక్కువమంది సాల్సా నృత్యానికే ఎక్కువ ఆదరణ వుంటుంది. ఆయా స్టాల్‌లలో జనాలు కూడా ఎక్కువగా వుంటారు.

వీటన్నింటి కోలాహలం మధ్య ఎక్కడనుండో ఒక వీనులవిందైన సంగీతం వినిపిస్తూ మనకి తెలియకుండానే మనల్ని అటువైపు అడుగులు వేయిస్తుంటుంది. అదేమీ సాల్సా లాగ మన పాదాలని కదిపించదు, రాక్ సంగీతం లో మన మనసుల్ని ఉత్తేజితుల్ని చెయ్యదు కానీ మనల్ని ఈ ప్రపంచం నుండే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఒక్కసారి ఏ అమెజన్ అటవీ ప్రాంతానికో వెళ్ళిపోయినట్లనిపిస్తుంది. అక్కడ ఎండిపోయిన వెదురు చెట్ల ఖాళీల్లోంచి గాలి వీస్తుంటే వాటినుండి వచ్చే వినసొంపైన, అతి మధురమైన సంగీతాన్ని మనము వున్నచోట్నుండే అనుభవించి ఆరాధించేలా చేస్తుంది. మధ్య మధ్యలో పక్షుల ఊళలు, గుడ్లగూబల అరుపులు ఇవన్నింటిని మనకి పరిచయం చేస్తుంది. ఇంతకీ ఇది ఏ సంగీతం అనుకుంటున్నారా, సలస్కామర్కా అనే పేరుతో ఈక్వెడార్ నుండి వచ్చిన ఐదుగురు సోదరులు కలసి స్థాపించిన గ్రూప్ ప్రదర్శించే వారియొక్క సాంప్రదాయ జానపద సంగీతం. వారి సంప్రదాయ పద్ధతిలో తలలో పక్షి ఈకలు జంతు చర్మాలతో తయారు చేసిన, నదీ పరీవాహక ప్రాంతాలలో దొరికే రక రకాల గవ్వలతో అలంకరించిన దుస్తులు ధరించి, వెదురు బొంగులతో చేయబడిన అనేక రకాలైన పిల్లనగ్రోవిలతో చేసే సంగీత నృత్య విన్యాసాలు ఫెస్టివల్‌లో అకట్టుకుంటూ అక్కడే మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి.

మీరు జూన్ లో గనక స్విస్/ జ్యూరిక్ విజిట్ చేస్తే కలియాంతే లో పాల్గొనడానికి కుదురుతుందేమో చూసుకోండి.

ఇదిగో ఇక్కడ ఒక శాంపిల్ మీకోసం :



PS : I dont know how they spell "Samayasana" & "Salaskamarka", నేను ఎలా పలుకుతుంటానో అలానే తెలుగులో టైప్ చేసేశా

Sunday, March 6, 2011

కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను - అన్నమాచార్యవారి కీర్తన

ఈ కీర్తన M.S. సుబ్బలక్ష్మిగారి స్వరంతో విన్నప్పుడు శ్రీమహావిష్ణువుని నా ఊహాల్లో నిలుపుకుంటూ నన్ను నేను మరచిపోతాను. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ కీర్తన స్మృతిలోకొచ్చినపుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. (క్రింది కీర్తనలోని పదాలలో తప్పుగా టైప్ చేసుంటే చెప్పండి సరిదిద్దుకుంటాను)

కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను నంటుచూపులు జూచే నగుమోదేవుని
కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను నంటుచూపులు జూచే నగుమోదేవుని

కనకపుపాదములూ ..
కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ
కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ ఘన పీతాంబరముపై కట్టుకట్టారి
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు ఉనరనభికమల ఉదరబంధములూ || కంటి ||

గరిమవరద హస్తా కటిహస్తములొనూ సరసనతిల శంకచక్రహస్తములూ
ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములూ
ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములు తరుణీ అలమేలుమంగ ధరణిభామయునూ || కంటి ||

కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులూ
కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులు కట్టాని ముత్యాల సింగారనామము
నెట్టని శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు
నెట్టని శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు అట్టే శిరసుమీద అమరే కిరీటము || కంటి ||