Sunday, October 16, 2011

వినూత్నపంథాలో పంజా సినిమా పబ్లిసిటీ !!!

//
Glad that finally your admin decided to join me in this group :-). Thank you for all the support and the overwhelming response for "our" movie. The next 2 months will be an exciting journey for all of us. Let's make this a memorable movie for kalyan annayya!!!You guys are really awesome! Real Hardcore power star fans!!!Like me:-)
//
Less than 2 months to go...
Enti itha calmgaa unnaru? Let's make some noice...
//
పైన మాటలు ఆర్కుట్ పవన్ ఫాన్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేసిందెవరో తెలుసా ..
పవన్‌కళ్యాణ్ రాబోయే సినిమా పంజా నిర్మాతలలో ఒకరైన నీలిమ తిరుమలశెట్టి.

గత ఐదేళ్ళుగా ఆర్కుట్‌లో చూస్తున్నా, పవన్‌కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు ప్రతిసారీ అభిమానులు చేసే సందడి, పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసే వినూత్నమైన ఆలోచనలు అద్భుతంగా వుండేవి. కాకపోతే అవి నిర్మాతల వరకు చేరేవి కావు. కానీ ఈసారి వాళ్ళ శ్రమ వృధా కాదన్న నమ్మకం నాకుంది.

మొన్న first look రిలీజ్ అయిన రోజు నుండి గమనిస్తున్నా, పంజా సినిమా నిర్మాతలు ఏదో కొత్తగా చేద్దామని ప్రయత్నిస్తున్నారు. బయట పబ్లిసిటీ (టి.వి, పోస్టర్స్ లాంటివి) ఏం చేస్తున్నారో తెలీదు కానీ, ఇంటర్నెట్ ప్రపంచంలో పవన్‌కళ్యాణ్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు, ఆశ్చర్యపరుస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లలో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. పబ్లిసిటీ ఎలా చెయ్యాలని సలహాలు అడుగుతున్నారు. వాళ్ళకి నచ్చిన సలహాలు ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజ్‌లలో పబ్లిష్ చేస్తున్నారు (సలహా ఇచ్చిన వాళ్ళ పేరుతో సహా). సినిమాకి పని చేసిన టీంని పరిచయం చేస్తున్నారు. మొన్న ఫైట్‌మాస్టర్స్కి, నిన్న దర్శకత్వశాఖ బృందానికి ఇలా ధన్యవాదాలు చెప్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య పవన్ సినిమాల్లోకొచ్చి 15 సంవత్సరాలైన సందర్భంగా పంజా వెబ్సైట్‌లో ఒక పవన్ గురించి ఒక ఆర్టికల్ రాశారు ఇంకో నిర్మాత నగేష్ ముంతా. ఇలా రోజూ ఏదో ఒక న్యూస్‌తో వస్తున్నారు.

వీళ్ళ తరహా చూస్తే పవన్ వీరాభిమానినైన నాకు వీళ్ళ పైన ఈర్ష్య కలుగుతుంది, వీళ్ళలా అభిమానాన్ని చాటుకునే అవకాశం నాకు లేనందుకు.

PS : వీళ్ళు కేవలం ఈసినిమాకే కాకుండా భవిష్యత్‌లో తీసే ఏ సినిమాకైనా ఇదేవిధంగా పనిచేస్తూ తెలుగు ప్రజలకి మంచి సినిమాలు అందించాలని కోరుకుంటున్నాను.

Some people might think they are exploiting some talent, only we fans know the happybess. (Some people say, Pawan kalyan's are not fans but fanatics and I am happy to agree with it)

Sunday, May 22, 2011

సమయసన - ఈక్వేడార్ సాంప్రదాయ సంగీతం

జ్యూరిక్ లో ప్రతి సంవత్సరం జూన్లో లాటిన్ అమెరికన్స్ అంతా కలసి "కలియాంతే" అనే ఫెస్టివల్ జరుపుకుంటారు. మొదట పదివేల మంది లాటిన్ అమెరికన్స్ తో ప్రారంభమైన ఈ ఫెస్టివల్‌లో ఇప్పుడు ప్రతియేటా లాటిన్ అమెరికన్లతోపాటు మొత్తం యూరప్ నుండి 3లక్షల మంది వరకు హాజరు అవుతున్నారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బ్రెజిల్ తదితర దేశాల నుండి కళాకారులు వచ్చి సంగీత నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. వీటితో పాటు లాటిన్ అమెరికన్‌ల అహారము మరియు పానీయాలు అదనపు ఆకర్షణ. ప్రపంచంలో అన్ని చోట్లా వున్నట్టే ఇక్కడ కూడా ఎక్కువమంది సాల్సా నృత్యానికే ఎక్కువ ఆదరణ వుంటుంది. ఆయా స్టాల్‌లలో జనాలు కూడా ఎక్కువగా వుంటారు.

వీటన్నింటి కోలాహలం మధ్య ఎక్కడనుండో ఒక వీనులవిందైన సంగీతం వినిపిస్తూ మనకి తెలియకుండానే మనల్ని అటువైపు అడుగులు వేయిస్తుంటుంది. అదేమీ సాల్సా లాగ మన పాదాలని కదిపించదు, రాక్ సంగీతం లో మన మనసుల్ని ఉత్తేజితుల్ని చెయ్యదు కానీ మనల్ని ఈ ప్రపంచం నుండే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఒక్కసారి ఏ అమెజన్ అటవీ ప్రాంతానికో వెళ్ళిపోయినట్లనిపిస్తుంది. అక్కడ ఎండిపోయిన వెదురు చెట్ల ఖాళీల్లోంచి గాలి వీస్తుంటే వాటినుండి వచ్చే వినసొంపైన, అతి మధురమైన సంగీతాన్ని మనము వున్నచోట్నుండే అనుభవించి ఆరాధించేలా చేస్తుంది. మధ్య మధ్యలో పక్షుల ఊళలు, గుడ్లగూబల అరుపులు ఇవన్నింటిని మనకి పరిచయం చేస్తుంది. ఇంతకీ ఇది ఏ సంగీతం అనుకుంటున్నారా, సలస్కామర్కా అనే పేరుతో ఈక్వెడార్ నుండి వచ్చిన ఐదుగురు సోదరులు కలసి స్థాపించిన గ్రూప్ ప్రదర్శించే వారియొక్క సాంప్రదాయ జానపద సంగీతం. వారి సంప్రదాయ పద్ధతిలో తలలో పక్షి ఈకలు జంతు చర్మాలతో తయారు చేసిన, నదీ పరీవాహక ప్రాంతాలలో దొరికే రక రకాల గవ్వలతో అలంకరించిన దుస్తులు ధరించి, వెదురు బొంగులతో చేయబడిన అనేక రకాలైన పిల్లనగ్రోవిలతో చేసే సంగీత నృత్య విన్యాసాలు ఫెస్టివల్‌లో అకట్టుకుంటూ అక్కడే మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి.

మీరు జూన్ లో గనక స్విస్/ జ్యూరిక్ విజిట్ చేస్తే కలియాంతే లో పాల్గొనడానికి కుదురుతుందేమో చూసుకోండి.

ఇదిగో ఇక్కడ ఒక శాంపిల్ మీకోసం :PS : I dont know how they spell "Samayasana" & "Salaskamarka", నేను ఎలా పలుకుతుంటానో అలానే తెలుగులో టైప్ చేసేశా

Sunday, March 6, 2011

కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను - అన్నమాచార్యవారి కీర్తన

ఈ కీర్తన M.S. సుబ్బలక్ష్మిగారి స్వరంతో విన్నప్పుడు శ్రీమహావిష్ణువుని నా ఊహాల్లో నిలుపుకుంటూ నన్ను నేను మరచిపోతాను. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ కీర్తన స్మృతిలోకొచ్చినపుడు కూడా అదే అనుభూతి కలుగుతుంది. (క్రింది కీర్తనలోని పదాలలో తప్పుగా టైప్ చేసుంటే చెప్పండి సరిదిద్దుకుంటాను)

కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను నంటుచూపులు జూచే నగుమోదేవుని
కంటికంటి నిలువు చక్కని మేనుదండలూను నంటుచూపులు జూచే నగుమోదేవుని

కనకపుపాదములూ ..
కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ
కనకపుపాదములు గజ్జెలూ అందెలునూ ఘన పీతాంబరముపై కట్టుకట్టారి
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు,
మొనసి వడ్డాణపు మొగపుల మొలనులు ఉనరనభికమల ఉదరబంధములూ || కంటి ||

గరిమవరద హస్తా కటిహస్తములొనూ సరసనతిల శంకచక్రహస్తములూ
ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములూ
ఉరముపై కౌస్తుభము ఒప్పగుహారములు తరుణీ అలమేలుమంగ ధరణిభామయునూ || కంటి ||

కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులూ
కట్టిన కంఠసరులు ఘనభుజకీర్తులు కట్టాని ముత్యాల సింగారనామము
నెట్టని శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు
నెట్టని శ్రీవెంకటేశా నీకు కర్ణపత్రములు అట్టే శిరసుమీద అమరే కిరీటము || కంటి ||

Monday, November 1, 2010

ఐతే అది నిజమైతే !!!

కష్టాల్లో వున్న ఒక అమ్మాయికి అండగా నిలుస్తూ తన ఉన్నతి కోసం అనుక్షణం పాటుపడే ఒక స్నేహితుడు ఆమెకోసం ఒక వరుడిని చూశాడు. అతను అనుకున్నట్టుగా వాళ్ళిద్దరూ జంటగా కలిస్తే ఎంత అందంగా ఉంటుందో అని పాట రూపంలో మనకి చెప్తున్నాడు.

నాకు ఈ పాటలో బాగా నచ్చినదేంటంటే, సాధారణంగా ఎవరికైనా మనం ఏదైనా ఉపకారం చేస్తే తిరిగి ఏదో ఒకటి ఆశిస్తాం. కానీ ఇక్కడ ఆ స్నేహితుడు ఏమీ ఆశించకుండా తన స్నేహితురాలు జీవితం ఉన్నతంగా వుండాలని కోరుకోవడం. ఆ ఉన్నతిని నిజాయితీగా ఆనందించడం. ఇలాంటి వాళ్ళు సినిమాల్లో తప్ప బయట కనిపించరనుకోండి అది వేరే విషయం.

ఈ పాటలోని పోలికలు నాకు చాలా ఇష్టం.

"ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే .. అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే.. "
పున్నమి వెన్నెల్లో విచ్చుకున్న పువ్వులు గాలికి ఊగుతూ నవ్వుతున్నట్టు అనిపించే క్షణం అనుభవించిన వాళ్ళకి అనిపిస్తుంది, ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి అని. వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకుంటే వాళ్ళ ఇల్లు ఎల్లప్పుడూ అలానే వుంటుంది అనే భావన.

"ఆ నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా"
ఒక సంస్థ అధిపతిగా ఉన్నత స్థానంలో వున్న అతనికి, అతని దగ్గర పనిచేసే ఆమెకి మధ్య అంతస్థుల్లో ఎంత తేడా ఉన్నా వాళ్ళని కలపడానికి రాయబారిని నేను అవుతా.

"చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా
ఆ చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా"
అతను ఒప్పుకుంటే వెన్నెల కురిసినపుడు కలువ పూవు పొందే ఆనందం ఆమె పొందుతుందని, అదే ఆమె ఒప్పుకుంటే అతని ముఃఖం పున్నమి చంద్రునిలా ప్రకాశిస్తుంది.

"నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే"
అతని ఆశలు అలా అలా ఆకాశానికి వెళ్ళి తరలతో కలిసి వాళ్ళ పెళ్ళికి తలంబ్రాలుగా కురిసే వేళ వాళ్ళిద్దరూ చేరువైతే.

"రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం"
స్త్రీ సహజమైన సిగ్గుతో చాటుగా ఆమె, అలాంటివేమి లెకుండా అతను చూసుకుంటూ చూపులతోనే రాయని శుభలేఖలు రాసుకుంటున్న ఈ సమయం కన్నా ఇంక సుముహూర్తం లేదని ఆకాశంలో వున్న అరుధతీ దేవి నిర్ణయించేసిందంట.

"మనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే"
సంధ్యాసమయం కనిపించే అరుణవర్ణం ఆమె నుదుట అతను దిద్దిన కుంకుమై మెరిసే వేళా వాళ్ళిద్దరూ చేరువైతే !!!

చిత్రం: శుభలేఖ
రచన: వేటూరి


ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ఐతే అది నిజమైతే అదే నిజమైతే
ల ల ల ల ల ల లా ల
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే .. ఐతే

నింగిలోని చంద్రుడికి నీటిలోని కలువకి దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా కలువ భామ అది వింతే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి తలంబ్రాలుగా కురిసే వేళా చేరువైతే.. ఐతే

రెమ్మ చాటు రాచిలక కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
ఆకసాన అరుధంతి నక్షత్రం తెలిపింది ఇదేనని సుముహూర్తం
మనసిచ్చిన మలిసంద్యలు కుంకుమలై కురిసి నుదుట తిలకమై మెరిసే వేళా చేరువైతే .. ఐతే
PS : ఇదే మొదటిసారి నేను ఒకపాట గురించి రాయడం. తప్పులు వున్నా, చెప్పిన విషయం క్లియర్ గా లేకపోయినా క్షమించేసి తప్పులు చెప్తే కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.

Wednesday, October 20, 2010

స్వీట్ హోం

ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. అబ్బాయి ఇంట్లో ఆ విషయం చెప్పేశాడు. ఈ రోజు ఆమెని తన అమ్మా నాన్నకి పరిచయం చెయ్యడానికి ఇంటికి తీసుకెళ్తున్నాడు.
అటువంటి సమయంలో ఆ అబ్బాయి తల్లి మనసులో ఆలోచనలు ఎలా వుంటాయి?
ఆ అమ్మాయి అంతరంగంలో అలజడి ఏమిటి ?
అసలు ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎటువంటిది ?
వాళ్ళ మధ్య సంభంధాలు ఎలా వున్నాయి ?

వీటన్నింటిని కాస్త హస్యంగాను కాస్త సెంటిమెంట్ తోను మరి కాస్త సస్పెన్స్ లోను పెట్టి మనకు చూపించారు బాలజీ & టీం ఈ "మిఠాయి వీడు" (స్వీట్ హోం) అనే లఘుచిత్రంలో. ఈ లఘుచిత్రం తమిళ్ లో వున్నా కానీ చూసేవాళ్ళకి భాషతో పని లేకుండా నటీనటుల హావభావాలతో కేమెరా పనితనంతో అందరికి అర్ధమయ్యేలా తీశారు. నా వరకు నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. కింద వీడియో వుంది చూడండి.Wednesday, September 29, 2010

యంథిరన్ రివ్యూ ???

ఈ రోజు ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న యంథిరన్ సినిమా ప్రీమియర్ షో చూశాను. సినిమా మొత్తంగా చూస్తే బానే వుంది. ఎప్పటిలాగే రజినీకాంత్ బాగా చేశాడు. ఐశ్వర్యరాయ్ అందంగా కనిపించింది అక్కడక్కడా వయసు మీద పడిన చాయలు కనిపించాయి. శంకర్ దర్శకత్వం గురించి చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా తీశాడు కాకపోతే అక్కడక్కడా చిన్న చిన్న స్క్రీన్ ప్లే లోపాలు వున్నాయి. కొన్ని చోట్ల సీన్ కీ సీన్ కీ మధ్య సింక్ మిస్ అయ్యింది. కారణం నిర్మాణం లో జరిగిన జాప్యం అనుకుంటా. కానీ గ్రాఫిక్ వర్క్ మాత్రం ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందు ఎన్నడూ చూడనంత అద్భుతంగా వున్నయి. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగించాయి.

పోజిటివ్స్ :
రజినీకాంత్ పంచ్ డైలాగ్స్, రోబోగా చేసిన విన్యాసాలు
ఐశ్వర్యారాయ్(బచ్చన్) నటన
గ్రాఫిక్స్

నెగెటివ్స్ :
రజనీ హ్యూమన్ కేరెక్టర్ కి డెప్త్ లేకపోవడం
అక్కడక్కడా స్క్రీన్ ప్లే లోపాలు
పాటల పిక్చరైజేషన్
స్టొరీ లో కొంచెం పట్టు తగ్గినట్టనిపించింది. శంకర్ ఆస్థాన రచయిత సుజాత లేని లోటు కనిపించింది.

ఓవరాల్ రేటింగ్ : 3.25 etc ...............................//

అని రేపు సాయంత్రం ప్రీమియర్ చూసొచ్చి రివ్యూ రాద్దామనుకున్నా. కానీ ఇక్కడ మా ఆఫీస్ టైంలో వేస్తున్నారు అందుకని వెళ్ళడం కుదరడం లేదు :(

Monday, August 23, 2010

గ్రేట్ ఆంధ్రా??

ఇది చూశారా, తమ్ముళ్ళు డ్రగ్ స్కాంలో ఇరుక్కుంటే వారిని బయటకి తీసుకురాకపోవడం వల్ల రవితేజ భాద్యత లేని అన్నయ్య అయ్యాడంట.
అంతే కాకుండా నిజాల్ని కప్పిపెట్టే అవకాశం వుండి కూడా అలా చెయ్యకుండా మొత్తం సినీప్రశ్రమకే తలవంపులు తెచ్చాడంటా.

అనుకునేవాడు వంద అనుకుంటాడు, వాటిని కూడా వార్తలుగా రాయడం గ్రేట్ ఆంధ్రావారికే చెల్లింది. ఎప్పటికి మారతారో వీళ్ళు ?!!

న్యూస్ చానల్స్ కూడా సినిమావాళ్ళు వున్నారని హడవుడి చేస్తున్నారు కాని హైదరాబాద్ లోనే కాదు మొత్తం అంధ్రాలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే గంజాయి గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నారా ?